APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నియామకం 2025 – పూర్తి గైడ్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో FBO 256 & ABO 435, మొత్తం 691 ప్రభుత్వ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అటవీ శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 691 పోస్టుల భర్తీ
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందులో 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 16, 2025 నుంచి ఆగస్టు 5, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
- సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
- పోస్టుల పేర్లు: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO)
- మొత్తం ఖాళీలు: 691
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO): 256
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO): 435
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 16, 2025
- దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5, 2025
- అధికారిక వెబ్‌సైట్: psc.ap.gov.in
అర్హతలు:
- విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన విద్యార్హతను గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూషన్ నుంచి కలిగి ఉండాలి.
- వయోపరిమితి: జూలై 1, 2025 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
- శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళా అభ్యర్థులు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి.
- ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి బోనస్ మార్కులు కేటాయిస్తారు.
ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ఉంటాయి.
- స్క్రీనింగ్ టెస్ట్: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ విధానంలో) నిర్వహిస్తారు.
- ఈ పరీక్ష సెప్టెంబర్ 7, 2025న జరగనుంది.
- మెయిన్స్ పరీక్ష: స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT): తుది ఎంపికకు ముందు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
ఫిజికల్ సామర్ధ్య / వాకింగ్ టెస్ట్
- పురుషులు: 25 కి.మీ – 4 గంటల్లో పూర్తి చేయాలి.
- మహిళలు: 16 కి.మీ – 4 గంటల్లో పూర్తి చేయాలి.
జీత భత్యాలు:
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910 వరకు.
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: నెలకు రూ. 23,120 నుంచి రూ. 74,770 వరకు.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులు: ప్రాసెసింగ్ ఫీజు రూ. 250, పరీక్ష ఫీజు రూ. 80 కలిపి మొత్తం రూ. 330 చెల్లించాలి.
- రిజర్వ్డ్ కేటగిరీలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ సైనికులు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. వారు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం:
- APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ను సందర్శించాలి.
- కొత్త వినియోగదారులు ‘వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్’ (OTPR) పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
- మీ OTPR ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్/అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారాన్ని నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించాలి.
- భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారం, చెల్లింపు రసీదు ప్రింటవుట్ తీసుకోవాలి.
ముఖ్య తేదీలు
ఈవెంట్ | తేదీ | గమనిక |
---|---|---|
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం | 16-07-2025 | APPSC అధికారిక పోర్టల్. |
ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు | 05-08-2025 (23:59 IST) | చివరి రోజు రద్దీకి ముందే సమర్పించండి. |
స్క్రీనింగ్ టెస్ట్ (OMR) | 07-09-2025* | ఆధికారిక వెబ్‌నోట్ ప్రకారం; కొన్ని మీడియా 09-09-2025గా తెలిపాయి – అధికారిక సైట్ చెక్ చేయండి. |
పోస్టుల వివరాలు
పోస్టు | ఖాళీలు |
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) | 256 |
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) | 435 |
మొత్తం | 691 |
Leave a Reply