అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన వ్యవసాయ పథకం. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది, ప్రత్యేకంగా చిన్న మరియు సన్నకారు రైతులకు. ఈ పథకం రైతుల సంక్షేమాన్ని కాపాడేందుకు, వ్యవసాయాన్ని స్థిరంగా మార్చేందుకు రూపొందించబడింది.ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం-కిసాన్ పథకం ద్వారా రూ. 6,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ. 14,000 కలిపి మొత్తం రూ. 20,000 మూడు విడతల్లో రైతులకు అందుతాయి.

✅ అన్నదాత సుఖీభవ పథకం లక్ష్యం
రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించి, వారి జీవితాలలో ఆర్థిక భద్రతను పెంచడమే ప్రధాన లక్ష్యం. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం యొక్క PM-KISAN పథకంతో అనుసంధానించి అమలవుతోంది.
✅ అర్హతా ప్రమాణాలు:
- ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉండాలి
- చిన్న, సన్నకారు రైతులు
- భూమి వివరాలు అధికారిక రికార్డుల్లో ఉండాలి
- ఆధార్, బ్యాంక్ ఖాతా తప్పనిసరి
✅ అప్లై చేయడం ఎలా?
1.సచివాలయం ద్వారా నమోదు చేయించుకోవచ్చు
2.మీ సేవా కేంద్రంలో కూడా అప్లికేషన్ సమర్పించవచ్చు
అవసరమైన డాక్యుమెంట్లు
- ఆధార్ కార్డు
- భూమి పట్టాదారు పత్రాలు
- బ్యాంక్ ఖాతా వివరాలు
- మొబైల్ నంబర్

✅ అన్నదాత సుఖీభవ స్థితి ఎలా చెక్ చెయ్యాలి?
స్టెప్-బై-స్టెప్ గైడ్:
- అధికారిక వెబ్‌సైట్ ని ఓపెన్ చేయండి
- “Beneficiary Status” లేదా “Scheme Status Check” ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయండి
- Submit బటన్ నొక్కిన తర్వాత మీ పేమెంట్ మరియు పథక స్థితి కనిపిస్తుంది
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది, ఇది మే 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా ₹20,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹14,000 మరియు కేంద్ర ప్రభుత్వం (పీఎం-కిసాన్) నుండి ₹6,000 ఉంటాయి. ఈ సహాయం మూడు వాయిదాలలో (ఒక్కొక్కటి ₹7,000, ఇందులో పీఎం-కిసాన్ నుండి ₹2,000 మరియు అన్నదాత సుఖీభవ నుండి ₹5,000 ఉంటాయి) జమ చేయబడుతుంది.
వాట్సాప్ ద్వారా స్థితిని తెలుసుకోండి:
మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ అర్హత మరియు స్థితిని సులభంగా తనిఖీ చేసుకోవచ్చు
- మీ మొబైల్‌లో 9552300009 అనే ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
- ఆ నంబర్‌కు “హాయ్” అని సందేశం పంపండి.
- ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌ను పంపడం ద్వారా మీ పథకం స్థితికి సంబంధించిన వివరాలను ఫోన్‌లోనే పొందవచ్చు
రైతు సేవా కేంద్రాల (RSK) ద్వారా:
మీకు ఆన్‌లైన్‌లో చూసుకోవడం వీలుకాకపోతే, సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని (RSK) సందర్శించి కూడా మీ స్థితిని తెలుసుకోవచ్చు అర్హులైన లబ్ధిదారుల జాబితాలను కూడా అక్కడ ప్రదర్శిస్తారు.ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోయినా లేదా ఏవైనా సమస్యలున్నా, అక్కడి అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చు
Leave a Reply