
దీపం పథకం స్థితిని ఎలా చెక్ చేయాలి? పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రజాప్రయోజన పథకం. దీని ద్వారా పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది. మీరు ఈ పథకానికి అర్హత పొందారో లేదో, లేదా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయాలంటే, క్రింద ఇచ్చిన మార్గదర్శిని పాటించండి.
పేద మహిళలను కట్టెల పొయ్యిల వాడకం నుంచి విముక్తి కల్పించి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ “దీపం పథకం” అమలు .
- మీరు అర్హత కలిగినవారిగా లేరు అంటే, స్థానిక కార్యాలయంలో (MRO Office) సంప్రదించండి.
- గెజిటెడ్ అధికారి సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, ఫోటోలు మొదలైనవన్నీ సరిగా అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం తగ్గుతుంది.
- మీరు డీపం పథకం క్రింద ఇప్పటికే లబ్ధిదారుడైతే, మీ గ్యాస్ ఏజెన్సీ వివరాలు కూడా అక్కడే కనిపిస్తాయి.

పథకం ముఖ్య ఉద్దేశ్యాలు:
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించడం.
- వంట కోసం కట్టెలు, ఇతర సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం.
- పొయ్యి పొగ వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి మహిళలను రక్షించడం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
- పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం.
- మహిళా సాధికారతను ప్రోత్సహించడం.
అర్హతలు:
- దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి.
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబానికి చెంది ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే మహిళ వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.
- కుటుంబంలో ఎవరి పేరు మీద ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు.
ప్రయోజనాలు:
- ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తారు.
- నాలుగు నెలలకు ఒకసారి చొప్పున ఈ సిలిండర్లను పొందవచ్చు.
- లబ్ధిదారులు ముందుగా సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత 48 గంటల్లోగా సబ్సిడీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
- కొన్ని సందర్భాల్లో, ప్రభుత్వం ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి రాయితీ డబ్బులను జమ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది.
దరఖాస్తు విధానం:
- ప్రభుత్వం నిర్దేశించిన తేదీలలో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత, కుటుంబ వివరాలను నింపి, అవసరమైన పత్రాలను జతచేసి సమర్పించాలి.
కావాల్సిన పత్రాలు:
- తెల్ల రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- నివాస ధృవీకరణ పత్రం
- బ్యాంకు ఖాతా వివరాలు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
సహాయం కోసం:
- ఏవైనా సందేహాలుంటే టోల్-ఫ్రీ నంబర్ 14400 లేదా 1967కు కాల్ చేయవచ్చు.

Leave a Reply